calender_icon.png 11 July, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటరి మహిళలే వారి టార్గెట్

11-07-2025 07:01:02 PM

చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అన్నదమ్ములు అరెస్ట్ 

వీరి వద్ద నుండి 19 లక్షల విలువ గల 8 బంగారు పూస్తేల తాడులు, 2 సెల్ ఫోన్లు,  4 మోటారు సైకిళ్లు స్వాధీనం 

వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ఒంటరిగా వెళ్తున్న మహిళలలను టార్గెట్ చేస్తూ వారి మెడలో  బంగారు పూస్తేల తాడులను ఎత్తుకెళ్తున్న అన్నా, తమ్ముళ్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ చరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల వద్ద 19 లక్షల విలువ గల 8 బంగారు పూస్తేల తాడులు,2 సెల్ ఫోన్లు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన 4 మోటారు సైకిళ్ళ ను స్వాధీనం  చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

త్రిపురారం మండలం నీలాయగూడెంకు చెందిన రావిరాల పవన్, రావిరాల రాజు అన్నదమ్ములిద్దరు ఈ నెల 4న చండూరు మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మారగోని బుచ్చమ్మ తన వ్యవసాయ కులం నుండి నడుచుకుంటూ ఇంటికి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చి మూడు కులాలు బంగారు పుస్తెలతాడు లాకెళ్ళారు. వెంటనే బాధితురాలు చండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో చండూరు సీఐ ఆదిరెడ్డి, ఎస్సై వెంకన్న, కనగల్ ఎస్సై విష్ణుమూర్తి లు నాలుగు టీములుగా ఏర్పడి కేసును త్వరీతగతిన ఛేదించారని ఆయన పేర్కొన్నారు.

ఈ చైన్ స్నాచింగ్ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం చండూరు మండలం తస్కాన్ గూడెం శివారు ప్రాంతంలో  శుక్రవారం  వాహనాలు తనిఖీ చేస్తుండగా అన్నదమ్ములు ఇద్దరు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని అదుపులోకి తీసుకొని  విచారించగా చెడు వ్యసనాలకు బానిసలై చైన్ దొంగతనాలకు పాల్పడుతున్నామని ఒప్పుకున్నారు.

ఇదే క్రమంలో గొల్లగూడెం, వాడేపల్లి మండలంలోని కల్లేపల్లి, ఎన్ పహాడ్ మండలంలోని నాజీపురం, లింగాల, దోస పహాడ్, వేములపల్లి మండలం బిర్లపహాడ్, నకిరేకల్ మండలం లోని చందుపట్ల, మర్రూర్ గ్రామాలలో నేరస్తులు 4 మోటార్ సైకిల్ ను ఉపయోగించి పుస్తెలతాడులను దొంగిలించారని పేర్కొన్నారు. ఈ కేసును త్వరితగతిన చేదించిన నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, చండూర్ సిఐకె అది రెడ్డి, చండూర్ ఎస్‌ఐ యన్.వెంకన్న, కనగల్ యస్.ఐ పి.విష్ణు మూర్తి,సిబ్బంది ఉపేంద్ర చారి, శ్రీకాంత్,కార్తీక్,హరున్,నగేష్, అనిల్, ఖలీల్, రమేష్, నరేందర్ లను  ఎస్పీ అబినందించారు.