calender_icon.png 11 July, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశువు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను అభినందించిన ఎస్పి

11-07-2025 06:45:12 PM

కానిస్టేబుల్ ను అభినందించిన ఎస్పి

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ నవజాత శిశువు ప్రాణాలను ఓ కానిస్టేబుల్ కాపాడాడు. ఉదయం 11:00 గంటలకు బిచ్కుంద పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ యాదగిరి విధులలో ఉన్నపుడు, పెద్ద దేవడ గ్రామ శివారులోని బిచ్కుంద-బాన్సువాడ రోడ్డు బ్రిడ్జి వద్ద రోడ్డు పక్కన ఒక నవజాత శిశువు (ఆడపిల్ల)ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసినారు. 

తక్షణమే ఈ ఘటనను గుర్తించిన యాదగిరి, శిశువు ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో పుల్కల్ PHC కి వెంటనే తరలించి మరల అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవజాత శిశువు ప్రాణాలను కాపాడిన్నందుకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్ పి రాజేష్ చంద్ర బిచ్కుంద పోలీస్ స్టేషన్ కి చెందిన కానిస్టేబుల్ యాదగిరి తక్షణ మే స్పందించి విలువైన శిశువు ప్రాణాలను కాపాడినందుకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.