11-07-2025 06:48:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): కుంటాల ఎంపీడీవోగా వనజ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంచార్జ్ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న లింబాద్రి నుంచి ఆమె బాధ్యతను స్వీకరించారు. ఎన్నికలకు ముందు బదిలీలో భాగంగా నిజాంబాద్ కు వెళ్లిన వనజ తిరిగి నిర్మల్ జిల్లాకు బదిలీ చేయడంతో ఆమె కుంటాలను ఎంపీడీవో నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తరలు జారీ చేస్తారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోకు అధికారులు లింబాద్రి రహీం అధికారులు అభినందించారు.