14-03-2025 12:31:34 AM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి లయన్ వి మధుసూదన్ రెడ్డి సహకారంతో మంచిర్యాల ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ సభ్యులు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేశారు. 66 మందికి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ తో పారు స్టేషనరీ ఐటమ్స్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు బాల మోహన్, కార్యదర్శి చంద్రమౌళి, ప్రోగ్రాం చైర్ పర్సన్ వి మధుసూదన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, అధ్యాపకులు లావణ్య, కృష్ణమూర్తి, రాణి, శశి కుమారి, కళావతి, జ్యోతి, రాజయ్య భాగ్యలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.