11-10-2025 01:55:09 AM
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): సైకాలజిస్టుల సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మల్కాజిగిరి ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్, అలెన్ కలర్స్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నందలి సరస్వతి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘ప్రపంచ మా నసిక ఆరోగ్య దినోత్సవం’ ప్రారంభ వేడుకల్లో ఆయన మాట్లాడారు.
శారీరిక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమని చెప్పారుఎ. మానసిక ఒత్తిడికి గురైన వారిలో మనోధైర్యాన్ని నింపాల్సింది సైకాలస్టేలనని అన్నారు. మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలచారి మాట్లాడు తూ.. టిపిఏ సైకాలజిస్ట్ యువత ఆత్మహత్యల వైపు దారి మల్లకుండా వారిలో అవ గాహన కల్పించేందుకు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు.
హెలెన్ కెల్లర్స్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ ప్రొఫెసర్ లయన్ పటాన్ ఉమర్ఖాన్ మాట్లాడుతూ ఈనాడు అంతర్జాల మాయలో పడి మానవ సంబంధాలు మర్చిపోతున్నారు. సోషల్ మీడియా, సెల్ఫోన్ ప్రపంచంలో మునిగి ప్రపంచం ఇదే అనే రీతిలో తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో కనీసం సంబంధ బాం ధవ్యాలు లేకుండా పోతుంది అని అన్నారు. ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2025‘ లో ఈనాటికీ సమాజంలో సహజంగా విపత్తులు, అత్యవసర పరిస్థితులతో మానసిక ఆరోగ్య సేవలకు ప్రాధాన్యత అనే అంశంపై డాక్టర్ ప్రవీణ్ కుమార్ సత్య ట్రిస్ట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతికూరి రామచంద్ర మాట్లాడుతూ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా‘ హైద రాబాద్, తెలంగాణలోని అన్ని జిల్లాలలో తమ సంఘం ద్వారా ఈ సంవత్సరం థీమ్ కి అనుగుణంగా సంఘ సైకాలజిస్టులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరు గుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజు ఆచార్య వైదేహి, నాయకులు ఆలి యా పర్వీన్, డాక్టర్ వెంకటేశ్వర్లు, సోనాలి నా గ్ దేవ్, హరీస్ శంకరదాస్ పాల్గొన్నారు.