calender_icon.png 22 December, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

22-12-2025 01:23:50 AM

హనుమకొండ, డిసెంబర్ 21 (విజయక్రాంతి): హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూర గాంధీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గాంధీ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి నేటి వరకు ఆర్థిక లావాదేవీలు, మరియు వాకర్స్ అసోసియేషన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా వాకర్స్ యొక్క భద్రత కోసం, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి నెల ఉచిత మెడికల్ క్యాంపులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవానందం, మదన్ మోహన్ రెడ్డి మహిళా వాకర్స్ గిరిజ, అన్నపూర్ణ, పద్మ, లలిత, లక్ష్మి, అనిత, రేణుక, ప్రమీల, జ్యోతి, కమిటీ కార్యదర్శి విజయ్ కుమార్, చంద్రమౌళి, కుమారస్వామి, రవికుమార్, ఆర్‌ఎస్‌ఐ సదానందం, రమేష్, పులి సమ్మయ్య, సురేందర్,రాఘవరెడ్డి, నన్నే సాహెబ్, అసన్ అలీ, గంగాధర్, రమేష్, దేవదాసు, నరసయ్య పెరుమాండ్ల రవి, హరికృష్ణ, వీణ, వీరు నాయక్,వేణు, చక్రపాణి తదితరులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి సహకరించిన వాకర్స్ మిత్రులకు, పబ్లిక్ గార్డెన్ సిబ్బందికి ఈ సందర్భంగా గాంధీ కృతజ్ఞతలు తెలియజేశారు.