08-07-2025 01:24:31 AM
జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్, జూలై 7: ప్రజావాణికి వచ్చిన ఆర్జీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 152 ఆర్జీలను స్వీకరించారు.
సంబంధిత అధికారులు ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని, జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ పథకాలు పక్కగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు.జిల్లా అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.