08-07-2025 01:24:54 AM
ప్రజాబలంతోనే వందేళ్లు మనగలిగాం ముత్యాల విశ్వనాథం సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం జులై 7 (విజయ క్రాంతి); జూలై 12న జరగనున్న సీపీఐ పాల్వంచ పట్టణ 19వ మహాసభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం పిలుపు నిచ్చారు. సోమవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు.
ప్రజలకు అందించిన సేవల ఫలితమేనన్నారు. జూలై 12న పట్టణ పరిధిలోని లారీ అసోసియేషన్ హాల్ నందు మహాసభ నిర్వహించనున్నట్లు, పట్టణ పరిధిలోని ప్రతి వార్డు నుండి కార్యకర్తలు సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని పట్టణ మహాసభను జయప్రదం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, వీ పద్మజ, డీ సుధాకర్, నాయకులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, చెన్నయ్య, అన్నారపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.