08-07-2025 01:23:19 AM
జహీరాబాద్, జూలై 7 : పీర్ల పండుగ మత సామరస్యానికి ప్రతీకని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. జహీరాబాద్ లోని పీర్ల మసీదులను ఆయన సందర్శించారు. జహీరాబాద్ పట్టణంలోని గడి మహిళ లో నెలకొల్పిన జుల్ఫికర్ హుస్సేన్ భాష కీళ్లకు మాజీమంత్రి చంద్రశేఖర్ దట్టీలను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పీర్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని, ఈ ఉత్సవాల్లో కుల మతాలకతీతంగా పాల్గొంటున్నారని, గడి మహిళలోని పీర్ల ఉత్సవాల కమిటీ తరపున మాజీ మంత్రి చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు కాండం నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ నరేష్ గౌడ్, కాజా నహీం ,అహ్మద్ మోయిజ్, జనార్ధన్, వసీం పాల్గొన్నారు.