ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి పొన్నం ప్రభాకర్
చార్మినార్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకనుగుణంగా కృషి చేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా చార్మినార్ వద్ద ఏర్పాటు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తోందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించేందుకు సర్కార్ కృషి చేస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తుంటే ఓర్వలేని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
గజ్వేల్, డిసెంబర్ 11: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలోని సమస్యల పరిష్కారానికి అధక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వర్గల్ మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకులలో ౪ రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రీడల ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా రాష్ట్రంలోని 25వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.




