calender_icon.png 26 August, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

26-08-2025 12:12:33 AM

వేములపల్లి, ఆగస్టు 25 :- గ్రామాల అభివృద్ధి,ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే  బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం వేములపల్లి మండలం సల్కునూరు గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 32 లక్షల రూపాయలతో నూతన గ్రామపంచాయతీ, అంగన్వాడి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. 

గత టిఆర్‌ఎస్ ప్రభుత్వం గడచిన పదేళ్ల కాలంలో పేదలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అవి పూర్తయిన వెంటనే బిల్లును కూడా చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రజల దీవెనలతో అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం  ముందుకెళ్తోందని తెలిపారు.

ముఖ్యంగా మహిళ సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వాలంబన సాధించే  దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్ ,బిజెపి పార్టీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, చిరుమర్రి కృష్ణయ్య, మాలికాంత రెడ్డి , రావు ఎల్లారెడ్డి, పుట్టల కృపయ్య, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ అధికారులు , గ్రామ కాంగ్రెస్ నాయకులు, బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.