26-08-2025 12:13:20 AM
ఇబ్రహీంపట్నం: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదర్‌గుల్ గ్రామం, అశోక్ రెడ్డి కాలనీకి చెందిన అజ్మత్ అలీ కుమారుడైన ఉమైర్ (6), తన తల్లితో కలిసి సోమవారం సాయంత్రం వాకింగ్ కోసం అని సున్నం చెరువు కట్టకు వచ్చాడు. మృతుడి తల్లి కొంచెం దూరం వెళుతుండగా, బాలుడు తన చిన్న సైకిల్‌ను చెరువు కట్టపై వదిలి, చెరువులోకి వెళ్ళాడు.
అతను సాధారణంగా నీటిని చూస్తూ బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి అతను మునిగిపోయాడు. దీంతో బాలుడు కనిపించడంలేదని డయల్ 100 కాల్ రావడంతో, వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అగ్నిమాపక శాఖ కూడా అక్కడికి చేరుకుంది. వారి సహాయంతో మునిగిపోయిన బాలుడి మృతదేహాన్ని చెరువు నుండి వెలికితీశారు. అయితే మరణించిన బాలుడు మానసికంగా బాగాలేడనీ కుటుంబ సభ్యులు తెలిపారన్నారు, మృతదేహాని ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించామని, ఈ మేరకు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.