10-12-2025 12:00:00 AM
పాలకుర్తి రామమూర్తి :
అమాత్య సంపదోపేతాః సర్వాధ్యక్షాః శక్తితః కర్మసు
నియోజ్యాః కర్మసు చైషాం నిత్యం పరీక్షాం కారయేత్..!
(కౌటిలీయం - 2--9)
నియమించబడిన అమాత్యులను అనగా ఉన్నతాధికారులు లేదా విభాగాధిపతులనందరినీ వారి వారి శక్తిసామర్థ్యాలను అనుసరించి నాయకుడు వారిని ఆయా బాధ్యతల్లో నియమించాలి. ఎంతటి మానసిక స్థుర్యైం కలిగిన వ్యక్తియై నా ఎప్పుడో ఒకప్పుడు ప్రలోభాలకు లొంగిపోవడం.. బెదిరిస్తే భయపడడం సహజమే కాబట్టి వారిని నిత్యమూ పర్యవేక్షించాలి.. పరీక్షించాలి. మానవులు గుఱ్ఱాలవంటి వారు కాబట్టి నియమితులయ్యాక వికృతంగా, అడ్డ దిడ్డంగా ప్రవర్తిస్తా రు అంటాడు, ఆచార్య చాణక్య.
డబ్బు కోశానికి రావడం, అక్కడి నుంచి ప్రజోపయోగ కార్యక్రమాల్లో వినియోగించడం మధ్య ఎందరో అధికా రులు దానిని పర్యవేక్షిస్తుంటారు. వారిలో ఏ ఒక్కరు తప్పు చేసినా ద్రవ్య వినిమయం సజావు గా సాగదు. ప్రభుత్వ నిధులను అధికారులు, నేతలు అపహరించడం లేదా దురుపయోగం చేయడం జరగవచ్చు.
అందుకే పటిష్టమైన ఆర్థిక విధానం ఏర్పరచడమే గాక దానికి తగిన ఆడిట్ విభాగాన్నీ బలోపేతం చేయాల్సిన అవసరాన్ని చెప్పాడు చాణక్య. అధికారులు ప్రభుత్వ ధనాన్ని అపహరించే విషయంలో కనీసం 40 విభిన్న పద్ధతులను ఎత్తిచూపిన చాణక్య, వాటికి అత్యంత కఠినమైన శిక్షలను కూడా సూచించాడు.
అవినీతి, అక్రమాలు..
ఏ కాలంలోనైనా అధికారంలో ఉన్న వ్యక్తుల్లో అవినీతి, అక్రమ సంపాదన ఉండనే ఉంటుంది. దానిని వీలైనంత మేరకు తగ్గించి.. పౌరసేవలను ప్రభావవంతంగా నిర్వహించడం వల్ల పాలకులు సమగ్రతను, ఉత్తమత్వాన్ని సాధించగలుగుతారు. అల్లంత ఎత్తున ఆకాశంలో ఎగిరే పక్షి కదలికలను గమనించడం సాధ్యమేమో కాని పక్కనే ఉన్న ప్రభుత్వ అధికారుల మనసును గ్రహించడం మా త్రం అసాధ్యం. అందుకని ఆధారాలతో పట్టుబడిన అధికారి చిన్న తప్పిదాన్నునా క్షమించకుండా జరిమానాలు, దండనలు విధించమని చెపుతున్నాడు, చాణక్య.
దానితో మోసం చేయాలన్నా.. అవినీతికి పాల్పడాలన్నా అధికారులు భయపడతారని ఆయన భావన. సమాజంలో శాంతిభద్ర తలను నెలకొల్పవలసిన బాధ్యత పాలకులపై ఉంటుంది. రాజకీయ సుపరిపాలన, ఆర్థికంగా నిలకడ కలిగిన అభ్యుదయం.. ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. రాజకీయ లక్ష్యాలు ఉన్నతంగా ఉంటేనే.. ఆర్థిక ప్రగతి సాధ్యపడుతుంది. ఆచార్య చాణక్య దృష్టి కోణంలో మార్గాన్ని గమ్యం నిర్దేశిస్తుంది.. రాజకీయ సుపరిపాలన గమ్యం కాగా ఆర్థికరంగ నిర్వహణ మా ర్గంగా భావిస్తారాయన.
మంచి పరిపాలన కోసం అవినీతిపరులైన అధికారులను శిక్షించడం.. బాధ్యత వహించి, జవాబుదారీగా పనిచేసే సమర్ధులైన అధికారుల పదవులను ఉన్నతీకరించడం అవసరం. అవినీతి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగిన వ్యవస్థను ఏర్పాటు చే యాలి. అవసరమైన చోట కఠినంగా వ్యవహరించాలి, అంటారాయన. పనిచేసే అధికారిని, చేసే విధానాన్ని, దేశ కాల పరిస్థితిని, కార్యపరిధిని, లాభ నష్టాలను అనునిత్యమూ తెలుసుకుంటూ ఉండాలి.
అధ్యక్షులందరూ రాజాజ్ఞానుసారం పనులు నిర్వర్తించాలి. ఉన్నతాధికారులు ఒకరితో మరొకరు ఎక్కువమార్లు కలవకుండా చూడాలి.. అలాగని ఒకరితో మరొకరికి విరోధం లేకుండా వారంతా ఎవరి పనులు వారు సమన్వయంతో ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. వారంతా కలిస్తే నాయకునికి హాని తలపెట్టవచ్చు.. విరోధంతో ఉంటే పనులు చెడగొడతారు, అంటా రాయన.
వేతనాల్లో కోతలు..
సాధారణ పరిస్థితుల్లో, అధికారులు తాము చేసే పనులకు, పాలకుల ముందస్తు అనుమతి తీ సుకోవాలి. అయితే అత్యవసర పరిస్థితుల్లో అధికారులే తగు నిర్ణయం తీసుకొని పాలకులకు సమాచారమివ్వాలి. విధి నిర్వహణలో ప్రమత్తులైన అధికారుల వేతనాల్లో కోతను విధించాలి. అలాగే వారి నిర్ణయాల మూలంగా సంభవించిన నష్టానికి రెండు రెట్లు ‘అత్యయం’ (ఫైను, పెనాల్టీ) విధించాలి, అంటారాయన. తక్కువ వేతనాలు పొందే అధికారులు స్తోమతకు మించి ఖర్చు చే స్తున్నారంటే.. రాజ ద్రవ్యాన్ని భక్షిస్తున్నట్లుగా భావించాలి.
ప్రజల నుంచి ధనం రెట్టింపుగా వసూలు చేస్తున్న అధికారులు జనాన్ని భక్షిస్తున్నారని భావించాలి. అలాంటి వారిని అవసరానుగు ణంగా మందలించడం గాని, తగు రీతిని దండించడం గాని చేయాలి. అజ్ఞానం చేతగాని, సోమరి తనం చేతగాని, భయం చేతగాని, ప్రమాదవశాత్తు గాని, కామక్రోధదర్ప లోభాదుల చేతగాని కోశాగార ఆదాయాన్ని తగ్గిస్తున్న అధికారులను అ యా కారణాలకు ఎన్ని రెట్ల ధనం జరిమానాగా వేయడం న్యాయమో అన్ని రెట్లు వేసి శిక్షించాలి.
అవినీతి అధికారుల చర్యలను గూఢచారుల ద్వా రా నిర్దారించుకొని తగిన సాక్షాధారాలతో వారిపై చర్యలు తీసుకోవాలి. ఈనాడు భారత పాలనా వ్యవస్థలో కొందరు బాధ్యత గలిగిన నాయకులు, అధికారులు అవినీతిలో కూరుకుపోతున్నారు. అ లాగే ఉన్నత స్థాయి అధికారుల పనితీరును అం చనా వేయడానికి, సమీక్షించడానికి మార్గదర్శకా లు ఉన్నప్పటికీ ఆ వ్యవస్థల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే బాధ్యతాయు త అధికారుల అవినీతిపై నిఘా పెట్టడానికై ఏర్పడిన వివిధ ప్రభుత్వ విభాగాలు.. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, ఏసీబీ, ప్రత్యేక నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. అయితే, ఈ నిఘా వ్యవస్థలు కూడా కొన్నిసార్లు అవినీతికి పాల్పడటం లేదా అక్రమాలకు పాల్పడే అధికారులకు కొమ్ముకాయడం లేదా వారితో కుమ్మక్కు అవినీతి నివేదికలను తారుమారు చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు వింటున్నాము.
పారదర్శకత అవసరం..
ఈ సమస్యలను అధిగమించాలి అంటే ప్రభు త్వ విధానాల్లోనూ, పాలనావ్యవస్థలోనూ పారదర్శకత పెరగాలి. ప్రక్రియలను సులభతరం చేయ డం వల్ల అధికారుల్లో అసమర్థతను తగ్గించడం, పారదర్శకతను పెంచడం సాధ్యపడుతుంది. జవాబుదారీతనం, నైతికతను నిర్ధారించడానికి ప్రభుత్వ, పౌరసేవా సంస్థలను బలోపేతం చేయా లి. పౌరులను పాలనావ్యవస్థలో భాగస్వాములను చేయడం వల్ల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది.
దానితో అధికారులు నియమాలను ఉల్లంఘించేందుకు సా హసించరు. అయితే ఫిర్యాదుదారుకు రక్షణ ఉం డాలి. నియమ నిబంధనలను కచ్చితంగా అమ లు చేయాలి. దోషిగా తేలిన అధికారులపై ఆశ్రిత పక్షపాతం లేకుండా.. వీలైనంత త్వరగా న్యాయపరమైన విచారణను ముగించి కఠినమైన చర్య లు తీసుకోవాలి.
అత్యాధునిక సాంకేతిక విజ్ఞానా న్ని వినియోగించుకొని అన్ని విభాగాలను పర్యవేక్షించాలి.ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అవినీతిని అం తమొందించాలని ప్రయత్నిస్తే.. అవినీతి భూ తాన్ని తరిమికొట్టడం సాధ్యపడుతుంది. ప్రజాధనమూ దుర్వినియోగం కాదు.. దేశమూ సుభిక్ష మౌతుంది.