calender_icon.png 20 December, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేమాతరం!

10-12-2025 12:00:00 AM

వందేమాతర గేయం 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరపడం శుభసూచకం. వందేమాతర గేయం స్వాతంత్య్రోద్యమంలో ఒక రణ నినాదంగా ఉపయోగపడింది. కులాలు, మతాలు, భాషలు, వర్గ భేదం లేకుండా దేశ ప్రజలంతా స్వాతంత్య్రం కోసం నినదించిందే ‘వందేమాతరం’. ప్రజల్లో స్వాతంత్య్రకాంక్షను తెలియజేయడా నికి బెంగాల్‌కు చెందిన బంకించంద్ర చటర్జీ 1875లో వందేమాతర గేయాన్ని సంస్కృతంలో రాసినప్పటికీ ఈ గేయం అందరికీ అర్థమయ్యేలానే ఉంటుంది.

అలాంటి వందేమాతరం గేయంపై పార్లమెంట్‌లో చర్చిం చడం ఆ గేయానికి మనమిచ్చే గౌరవంగా భావించొచ్చు. చర్చ సందర్భంగా వాదనలు, ప్రతివాదనలు ఎలా ఉన్నా వందేమాతరం గేయం వెనుక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను మరోసారి స్పష్టంగా తెలియజేశారు. సోమవారం లోక్‌సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వందేమాతరం గేయం గురించి స్పష్టంగా తెలియజేశారు. వందేమాతర గేయం స్వాతంత్య్ర పోరాటాన్ని ఉర్రూతలూగించిందని, స్వాతంత్య్ర సాధన దిశగా జాతీయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందన్నారు.

అఖండ భారత్‌ను దృష్టిలో పెట్టుకొని రాసిన గేయం కావడంతో ప్రస్తుతం పాకిస్తాన్‌లో చేరి న సింధు నది ప్రస్తావన కూడా ఇందులో ఉందని, ఈ తరానికి వందేమాతరం గొప్పతనం తెలియజేయడం కోసం ఈ గేయాన్ని మళ్లీ పిల్లల చేత పాడించాలన్నది తన సంకల్పమని మోదీ ఆకాంక్షించారు. అయితే వందేమాతరం గేయం ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తుందనే వాదనతో అప్పటి ప్రధాని నెహ్రూ.. ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాడి ద్రోహం చేశారన్నారు.

సామాజిక, సామరస్యత పేరుతో వందేమాతరం గే యాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని మోదీ ఆరోపించడం ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనుండ డంతో వందేమాతరంపై ప్రత్యేక చర్చను చేపట్టారని, నెహ్రూ రాసిన లేఖ లో మోదీ కొంత భాగాన్నే ప్రస్తావించి అవమానించారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. ప్రియాంక వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీటుగా బదులిచ్చారు.

విపక్షాలు జాతీయ గీతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని, వందేమాతరం దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందన్నా రు. బంకించంద్ర ఛటర్జీ బెంగాల్ వాడైనప్పటికీ.. ఈ గేయం కేవలం బెంగాల్‌కు మాత్రమే పరిమితం కాలేదని, యావత్ దేశానికి తలమానికమని తెలి పారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో వందేమాతర గేయాన్ని నినాదంగా మార్చి ప్రజల్లోకి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని కేం ద్రం మరువద్దని రాజ్యసభ విపక్ష నేత ఖర్గే తెలిపారు. ఉద్యమంలో తమ నాయకులు జైలుకు వెళితే.. బీజేపీ పూర్వీకులు మాత్రం బ్రిటీష్ వారి కో సం పనిచేశారన్నారు.

అంతిమంగా మతం రంగు పులుముకోని వందేమాతరం గేయాన్ని దేశ ప్రజలంతా ఆలపించాల్సిన అవసర ముంది. ఈ గే యం వింటేనే ఒళ్లు పులకరిస్తుంది. సమైక్యతాభావం వెల్లివిరుస్తుంది. ఈ గేయాన్ని పిల్లలకు నేర్పించాలని ఆనాడే పెద్దలు నిర్ణయించారు. తాజాగా పార్లమెంట్‌లో వందేమాతరంపై జరిగిన చర్చ ద్వారా గేయానికి ఉన్న ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలు అర్థం చేసుకుంటాయని ఆశిద్దాం.