01-05-2025 12:59:49 AM
4 వికెట్ల తేడాతో చెన్నై ఓటమి
చెన్నై, ఏప్రిల్ 30: ఐపీఎల్ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఆరో విజయాన్ని అం దుకుంది. బుధవారం చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్ (47 బంతు ల్లో 88) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. డెవా ల్డ్ బ్రెవిస్ (32) పర్వాలేదనిపించాడు.
పంజా బ్ బౌలర్లలో యజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, మార్కో జాన్సెన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికె ట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. కెప్టె న్ శ్రేయస్ అయ్యర్ (72) మరోసారి రాణించగా..ప్రభ్‌సిమ్రన్ (54) అర్థసెంచరీ చేశాడు.
చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, పతిరానా చెరో 2 వికెట్లు తీశారు. ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. నేడు జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.