calender_icon.png 2 May, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై ‘డబుల్ హ్యాట్రిక్’

02-05-2025 01:48:28 AM

  1. వంద పరుగులతో రాజస్థాన్ ఓటమి
  2. రాణించిన రోహిత్, రికిల్‌టన్
  3. నేడు గుజరాత్‌తో హైదరాబాద్ ‘ఢీ’

జైపూర్, మే 1: ఐపీఎల్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ‘డబుల్ హ్యాట్రిక్’ నమోదు చేసింది. గురువారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వంద పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రికిల్‌టన్ (61), రోహిత్ (53) అర్థసెంచరీలతో రాణించగా.. సూర్యకుమార్ (48*), పాండ్యా (48*) విధ్వంసం సృష్టించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, పరాగ్ చెరొక వికెట్ తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ఆర్చర్ (30) టాప్ స్కోరర్. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ, బౌల్ట్  చెరో 3 వికెట్లు తీయగా..  బుమ్రా  వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది