calender_icon.png 1 February, 2026 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికొండలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖ

01-02-2026 12:44:34 AM

ప్రారంభించిన పీఎన్‌బీ ఉన్నతాధికారులు

హైదరాబాద్, జనవరి 31(విజయక్రాంతి) : భారత దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), హైదరాబాద్ సర్కిల్ పరిధిలో మరో కొత్త శాఖను ఏర్పాటు చేశారు. మణికొండలో పీఎన్‌బీ బ్రాంచిని ప్రారంభించా రు.  హైదరాబాద్ జోనల్ హెడ్ (జనరల్ మే నేజర్) వందన పాండే, హైదరాబాద్ సర్కిల్ హెడ్ అరవింద్ కల్రా సమక్షంలో ఈ శాఖను ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో స్థానిక నివాసితులు, బ్యాంక్ ఖాతాదారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందన పాండే, అరవింద్ కల్రా మాట్లాడుతూ తమ బ్యాంక్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, ఖాతాదారులకు చేరువవ్వడం, సాంకేతికతతో కూడిన సమర్థవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.అందరికీ ఆర్థిక సేవలు అందాలనే బ్యాంక్ దార్శనికతకు అ నుగుణంగా ఈ చర్యలు ఉన్నాయని వారు స్పష్టం చేశారు.

కాగా మణికొండ శాఖ ప్రా రంభంతో హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని మొత్తం శాఖల సంఖ్య 76కు చేరుకుంది. కీలకమైన అభివృద్ధి ప్రాంతాల్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి మరియు ఈ ప్రాంత కస్టమర్ల మారుతున్న ఆర్థిక అవసరాలను తీర్చడానికి పీఎన్‌బీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా బ్యాంక్ ప్రతినిధులు    పేర్కొన్నారు.