24 June, 2026 | 11:23 PM

సిక్సర్ల సునామీ! పంజాబ్ 254 రన్స్ దంచికొట్టి లక్నోను చిత్తు

20-04-2026 12:59 AM

లక్నోను చిత్తు చేసిన పంజాబ్

కూపర్ కన్నోలీ విధ్వంసం

మరోసారి లక్నో బ్యాటర్లు ఫెయిల్

పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆ జట్టు బ్యాటర్లు విధ్వంసం సృష్టించిన వేళ ముల్లాన్ పూర్ లో సిక్సర్ల వర్షం కురిసింది. ఏకంగా 21 సిక్సర్లు బాదేసిన పంజాబ్ 254 పరుగుల భారీస్కోరుతో మ్యాచ్ ను వన్ సైడ్‌గా మార్చేసింది.  ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ విధ్వంసం అభిమానులకు టీ20 మజాను అందించింది. 

ముల్లాన్‌పూర్, ఏప్రిల్ 19 : ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం పంజా బ్‌కు బాగా కలిసొచ్చింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ డకౌటైనా, మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ రెచ్చిపోయారు. భారీ షాట్ల తో విరుచుకుపడ్డారు. లక్నో బౌలర్లను ఉతికారేశారు. బంతి ఎలా వేసినా సిక్సర్లు బాదే శారు. వీరిద్దరూ పోటాపోటీగా సిక్సర్లు, బౌం డరీలు బాదుతుంటే లక్నో బౌలర్లు కూడా ప్రేక్షకుల్లా మిగిలారు. మార్కరమ్ వేసిన ఓ ఓవర్లో అయితే ఏకంగా 32 పరుగులు బాదింది.

IPL 2026 అన్ని జట్ల తాజా పరిస్థితి, మ్యాచ్ రిజల్ట్స్ కోసం మా క్రికెట్ న్యూస్ పేజీ చూడండి.

దీనిలో ఐదు సిక్సర్లున్నాయి. కేవలం సిక్సర్లు కొట్టడమే లక్ష్యంగా గ్రౌండ్ లోకి వచ్చినట్టు కనిపించింది.  ప్రియాన్ష్ ఆర్య 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేయ గా.. కూపర్ కాన్లీ 35 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత రెచ్చిపోయి బ్యాటింగ్ ఆడారు. ఈ ఇద్దరు కలిసి ఏకంగా 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియాన్ష్ ఆర్య కేవలం 37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 రన్స్ చేశాడు.

మరోవైపు కూపర్ కన్నోలీ కూడా రెచ్చిపోయాడు. ముల్లాన్ పూర్‌లో సిక్సర్ల ఉప్పెన సృష్టించాడు. కేవలం 46 బంతుల్లో 87 రన్స్ చేసాడు. కూపర్ కన్నోలీ ఇన్నింగ్స్ లో 7 సిక్సర్లున్నాయి. ఫలితంగా పంజాబ్ కింగ్స్  20 ఓవర్లలో 254 పరుగులు చేసిం ది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2, సిద్దార్థ్ 2 వికెట్లు తీయగా.. మిగిలిన వారం తా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఛేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు మి ఛెల్ మార్ష్ , ఆయుశ్ బదోనీ దూకుడుగా ఆడారు.

IPL 2026 తాజా వార్తలు, స్కోర్‌కార్డులు అన్నీ ఒకే చోట చదవాలంటే మా హోంపేజ్ విజిట్ చేయండి.

తొలి వికెట్ కు 6 ఓవర్లలో 61 పరుగులు జోడించింది. బదోనీ 35, మార్ష్ 40 పరుగులకు ఔటవగా.. తర్వాత పంత్, మార్క్ రమ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. పూరన్ నిరాశపరిచినా పంత్, మార్కరమ్ ధాటిగా ఆడారు. అయినా కూడా లక్నో ఏ దశలో నూ విజయం వైపు సాగలేదు. పంత్ 23 బంతుల్లో 43 (4 సిక్సర్లు, 1 ఫోర్ )  పరుగులు చేసాడు. భారీ షాట్లు ఆడే క్రమంలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటర్లలో మార్కరమ్ తప్పిస్తే మిగిలిన వారంతా ఫెయిలయ్యారు. దీంతో లక్నో సూ పర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులే చేయగలిగింది. 

స్కోరు బోర్డు

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 254/7 ( ప్రియాన్ష్ ఆర్య 93, కూపర్ కన్నోలీ 87, స్టోయినిస్ 29 ; ప్రిన్స్ యాదవ్ 2/25, సిద్దార్థ్ 2/35 )

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 200/5 ( పంత్ 42 , మార్కరమ్ 42, మార్ష్ 40, యెన్సన్ 2/37, విజయ్‌కుమా ర్ వైశాఖ్ 1/30, చాహల్ 1/36 )


FAQ's:

❓PBKS vs LSG మ్యాచ్‌లో ఎవరు గెలిచారు?

👉 పంజాబ్ కింగ్స్ భారీ 254 పరుగులతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది.


❓ ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్లు ఎవరు?

👉 ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కన్నోలీ (87) అత్యద్భుతంగా ఆడారు.


❓ PBKS ఎంత స్కోర్ చేసింది?

👉 పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 254 పరుగులు చేసింది.


❓ లక్నో ఎందుకు ఓడిపోయింది?

👉 భారీ టార్గెట్, బౌలింగ్ వైఫల్యం, కీలక వికెట్లు కోల్పోవడం ప్రధాన కారణాలు.


❓ ఈ మ్యాచ్‌లో ఎన్ని సిక్సర్లు కొట్టారు?

👉 పంజాబ్ కింగ్స్ మొత్తం 21 సిక్సర్లు కొట్టి రికార్డ్ స్థాయి ప్రదర్శన చేసింది.


❓ IPL 2026లో ఇది హయ్యెస్ట్ స్కోర్‌లలో ఒకటేనా?

👉 అవును, ఈ సీజన్‌లో ఇది టాప్ హయ్యెస్ట్ టీమ్ స్కోర్‌లలో ఒకటి.


❓ లక్నో బ్యాటింగ్ ఎలా ఉంది?

👉 ప్రారంభం బాగున్నా, మధ్యలో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.


❓ PBKS ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?

👉 ప్రియాన్ష్ ఆర్య లేదా కూపర్ కన్నోలీ ఇద్దరిలో ఎవరికైనా ఇవ్వొచ్చు (పర్ఫార్మెన్స్ ఆధారంగా).


ఇవి కూడా చదవండి:

20 నుంచి టీసీఏ ఆల్‌స్టార్ టీ20 సూపర్ లీగ్

ఐపీఎల్ నుంచి ఖలీల్ అహ్మద్ ఔట్

RCB vs LSG: విరాట్ కోహ్లీ దుమ్మురేపగా బెంగళూరు ఘన విజయం

MI vs PBKS 2026: రోహిత్ ఆడతాడా? ముంబై ఒత్తిడిలో నేడు కీలక పోరు

KKR కష్టాలు మరింత పెరిగాయి: రహానేపై రూ.12 లక్షల జరిమానా, పాయింట్ల పట్టికలో అట్టడుగున

చివరి ఓవర్లో గెలిచిన కేకేఆర్… హీరోగా రింకూ!

ముంబై గెలుపు బాట పట్టేనా?

తప్పుడు ఆరోపణలను ఖండించిన హెచ్‌సీఏ

డికాక్ సెంచరీ వృథా… పంజాబ్ దంచికొట్టింది!

పంజాబ్ ధనాధన్

సెమీఫైనల్లో పంజాబ్, విదర్భ

పంజాబ్‌కు ఎదురుందా?