calender_icon.png 7 May, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేపట్టాలి

23-04-2025 12:00:00 AM

  1. జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

రైతులు సద్వినియోగం చేసుకోవాలి పిలుపు

ఇచ్చోడ, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పం డించిన పంటను అమ్ముకోవడానికి మార్కె ట్ యార్డ్‌కు వచ్చిన రైతన్నలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో మార్కుఫెడ్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి, వ్యాపారస్తుల నుంచి వచ్చే పంటను కొనుగోలు చేస్తు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.3,371 రూపాయి చెల్లించడం జరుగుతుందని, రైతులు సద్వినియో గం చేసుకోవాలని కోరారు. మధ్య దళారులను నమ్మకుండా పంటను నేరుగా మార్కె ట్‌కు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరిత కోటేష్, మా ర్కెట్ కార్యదర్శి ఆస్మా సుల్తానా, పీఏసీఎస్ ర్మన్ ఆన్ రెడ్డి నారాయణరెడ్డి, పిఏసిఎస్ సెక్రెటరీ రాథోడ్ ఈశ్వర్, మాజీ మండలాధ్యక్షుడు నిమ్మల ప్రీతం రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి తోపాటు బీఆర్‌ఎస్ పార్టీ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.