25-11-2025 12:17:31 AM
దర్శక-నిర్మాత నంది వెంకట్‌రెడ్డి ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్ష కుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా పేరు ‘ఇంద్రావతి’. మూరంరెడ్డి వెంకటేశ్వర్లు, వడ్ల సిద్ధార్థ, యందూరి నిహారిక చౌదరి, ఈది సుష్మ ఇందులో నాయకానాయికలు. సుమన్, లంకెల అశోక్‌రెడ్డి, ఘర్షణ శ్రీనివాస్, టార్జాన్, దిల్ రమేశ్, చిత్రం శీను, అర్చన, ధనుంజయ, నగేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సోమవారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దర్శక-నిర్మాత సంజీవ్‌కుమార్ మేగోటి ‘ఇంద్రావతి’ పెద్ద విజయం సాధించాలంటూ టీమ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రానికి డ్రమ్స్ రాము సంగీతం అందిస్తుండగా, విక్రమ్‌కుమార్ డైలాగులు రాశారు. డీ యాదగిరి డీవోపీగా పనిచేయగా ఎడిటింగ్ బాధ్యతలను సాయికుమార్ నిర్వర్తించారు.