calender_icon.png 25 November, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో చెప్పని వీరుడి కథ

25-11-2025 12:18:53 AM

‘కార్తికేయ2’తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన హీరో నిఖిల్ ఇప్పుడు తన కెరీర్‌లో మైలురాయిలా నిలిచే 20వ చిత్రం ‘స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీస్థాయిలో నిర్మించిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ భారీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఈ మహాశివరాత్రి సందర్భంగా 2026, ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ ప్రాజెక్టు జర్నీ గురించి తెలియజేస్తూ హీరో నిఖిల్ ‘రైజ్ ఆఫ్ స్వయంభు’ అంటూ సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. “ఒక్క సినిమా.. రెండు సంవత్సరాల కష్టం.. పదుల సంఖ్యలో సెట్లు.. వేల సవాళ్లు.. అదొక సామ్రాజ్యం. లక్షల మంది ప్రేక్షకులు.. కోట్ల పెట్టుబడి.. మా నిర్మాతలో భువన్ శ్రీకర్ల నమ్మకం. ఇదే మా ‘స్వయంభు’. మన భారతదేశ చరిత్రకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవి రాజుల కథలో, యుద్ధగాథలో కాదు.. మన సంస్కృతికి పునాదులు.

ఆ చరిత్రలో చెప్పని ఒక గొప్ప వీరుడి కథే ఈ ‘స్వయంభు” అని రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోలో కథానాయకుడు నిఖిల్ తన గుర్రం ‘మారుతి’ని కూడా పరిచయం చేశారు. ఈ సినిమాలోని తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కావడమే కాక ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. కథనానికి ప్రామాణికతను ఇవ్వడానికి హిందీ వెర్షన్‌కూ ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్; మాటలు: విజయ్ కామిశెట్టి; పాటలు: రామజోగయ్యశాస్త్రి; పోరాటాలు: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా; సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్‌కుమార్; ప్రొడక్షన్ డిజైన్: ఎం ప్రభాహరన్, రవీంద్ర; ఎడిటర్: తమ్మిరాజు.