22-06-2025 12:23:49 AM
ఇక్కత్ చీరెల తయారీకి కేరాఫ్ పుట్టపాక. చీరెల తయారీలో గ్రామానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఉంటుందీ పల్లె. ఈ గ్రామంలో 90 శాతానికి పైగా గ్రామస్తులు చేనేత వృత్తిని నమ్ముకునే జీవ నం సాగిస్తుంటారు. వారసత్వంగా వస్తున్న హస్తకళను తర్వాతి తరాలు కూడా అందిపుచ్చు కుంటూ, ప్రపంచం చూపును తమ వైపునకు తిప్పుకుంటున్నారు.
ఇక్కత్ విధానంలో తేలి యా రుమాళ్లు, డబుల్ చీరె ల తయారీలో వారు విశేషమైన ప్రావీణ్యం కనబరు సూ, కొత్త కొత్త డిజైన్లతో చీరెలు నేస్తున్నారు. తయారీలో రసాయనాల జోలి కి పోకుండా సహజ సిద్ధమైన రంగులతో తేలియా రుమా లు తయారు చేయడం వీరి ప్రత్యేకత. ఒక ఇక్కత్ చీరె నేసేందకు ఒక్కో నేత కార్మికుడు 15 20 రోజుల సమయం తీసుకుంటారు. రంగులు అద్దడం మొదలు నుంచి నిలువు, పేక డిజైన్లు సరి చేయడం వరకు ఎంతో సృజనాత్మకంగా చీరెను నేస్తారు.
పుట్టపాక నేతకా రులు నేసే తేలియా రు మాలుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రుమాలు వేసవిలో చల్లగానూ, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. నేతకారులు ఈ ప్రత్యేకత తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన రంగులు అద్దుతారు. నేసిన రుమాళ్లను సుమారు 20 రో జులు పాటు రంగుల మిశ్రమంలో నానబెడతారు. రంగు లు సాంతం నూలుకు పట్టే వర కూ అలాగే ఉంచుతారు. ఇక ఇక్కత్ చీరెల తయారీలో నేతకారులు ముందుగా నూలు ను బ్లీచింగ్ చేస్తారు. తర్వాత దానిని ఆరబెడతారు.
అనంతరం పడుగు చేసి, కట్లు పెట్టుకుంటారు. గంజిపోసి ఆరబెడతారు. ఆరిన తర్వాత మడత చేసుకుని డిజైన్ వేసి కట్లు వేసుకుని, నానబెడతారు. తర్వాత గుమ్మడి రంగు అద్దుతారు. రంగు అద్దిన నూలు ఎండిన తర్వాత మడతలు విప్పి, డిజైన్ అచ్చుకు అతికిస్తారు. తర్వాత మగ్గంపై చీరె నేయడాన్ని ప్రారంభిస్తారు. ఒక్కో చీరె రెండు, నుంచి మూడు వారాలు నేసి, అలా తయారు చేసిన చీరెలను హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలి స్తారు. ఇక్కత్ చీరెలు నేసి గజం గోవర్ధన్ అనే నేత కార్మికుడు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చకున్నాడు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రంలో గతంలో ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని సైతం అందించింది. గోవర్థనే కాక ఇంకా ఎంతో మంది నేత కార్మికులు ఇక్కత్ చీరెలు నేస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
సంస్థాన్ నారాయణపురం
మా కుటుంబాలను ఆదుకోవాలి
చేనేత కార్మికులకులందరికీ రాష్ట్రప్రభు త్వం జియో ట్యాగులు ఇవ్వాలి. త్రిఫ్ట్ స్కీ మునకు అర్హులు గా ప్రకటించాలి. నూలు, రసాయనాలపై నేత కార్మికులకు సబ్సిడీ కల్పించి ఆదుకోవాలి. రైతుల మాదిరిగానే చేనేత కార్మికు లకూ రుణమాఫీ పథకం వర్తింపజేయాలి.
- చెరుపల్లి నరసింహ, నేత కార్మికుడు, పుట్టపాక
ప్రభుత్వం సహకరిస్తే అద్భుతాలు సృష్టిస్తాం
గత ప్రభుత్వంలో నేత కార్మికుల కోసం త్రిఫ్ట్ స్కీం అమలు చేసింది. స్కీమును నేత కార్మికులందరికీ వర్తింప జేయాలి. కార్మికులతో పాటు రంగులద్దే వారికీ జియో ట్యాగులు ఇవ్వాలి. టెస్కో ద్వారా చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేయించాలి. చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ప్రభుత్వం నేత కార్మికులకు సహాయ సహకారాలు అందిస్తే మేం అద్భుతాలు సృష్టిస్తాం.
గజం శ్రవణ్ , పద్మశాలి యువజన సంఘం సంస్థాన్ నారాయణపురం మండల అధ్యక్షుడు