calender_icon.png 20 May, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

02-05-2025 12:03:33 AM

మండల నోడల్ అధికారి కుంభం ప్రభాకర్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే 1: ప్రభు త్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మండల నోడల్ అధికారి,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కుంభం ప్రభాకర్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ ప్రాథమిక,ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ ప్రాథమిక,ఉన్నత పాఠశాలల్లో చేరే విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఉన్నాయని,శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నట్లు చెప్పారు.

ఉచిత పాఠ్య,నోట్ పుస్తకాలు, రెండు జతల బట్టలు ఇవ్వడంతో పాటు రాగిజావ,సన్న బియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం ఉంటుందని తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ బడుల్లోని చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రారెడ్డి,అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ శైలజ,మాజీ చైర్మన్ రాంబాబు, గ్రామస్తులు బీరవోలు వాసుదేవరెడ్డి, జీడి స్వామి, రవి, ఆయా పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.