02-05-2025 12:03:28 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 1 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో 2020,ఫిబ్రవరి నెలలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులకు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు గురువారం తీర్పును వెలువరించింది.
కేసులో ప్రధాన ముద్దాయిలు అయిన లచ్చగూడెం గ్రామానికి చెందిన సోందే ముద్ద రాజు,సొందే రవి, మృతుడు కారం రామకృష్ణ ల మధ్య భూవివాద నేపథ్యంలో సోందే ముదిరాజు, సోందే రవిలు మరొక ఐదుగురు నిందితులతో కలిసి కారం రామకృష్ణ చంపడానికి కుట్ర పన్ని, తేదీ 2020, ఫిబ్రవరి 10న. రాత్రి సమయంలో కారం రామకృష్ణ తన ఇంట్లో భార్య పిల్లలతో నిద్రిస్తుండగా కత్తులు,కర్రలతో వెళ్లి హత్య చేసి, అడ్డు వెళ్లిన భార్యను తీవ్రంగా గాయపరచడం జరిగింది.
మొత్తం 08 మంది నిందితులపై హత్యా నేరం మోపగా,విచారణ సమయంలో ఇద్దరు ముద్దాయిలు మరణించడం, ఒక ముద్దాయిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. మిగిలిన ఐదుగురు ప్రధాన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చారు.. తీర్పు అనంతరం జిల్లా జడ్జి ఉత్తర్వుల మేరకు నిందితులను దుమ్ముగూడెం పోలీసులు అదుపులోకి తీసుకొని ఖమ్మం జిల్లా జైలుకు తరలించనైనది.
ఇట్టి కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన విచారణ అధికారి అయిన ఇన్స్పెక్టర్ నల్లగట్ల వెంకటేశ్వర్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అయిన రాధా కృష్ణ, పీవిడి లక్ష్మీ ,నోడల్ ఆఫీసర్ ఎస్త్స్ర ప్రవీణ్, లైజన్ ఆఫీసర్ వీరబాబు, దుమ్ముగూడెం కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ తిరుపతిని ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.