07-01-2026 12:06:27 AM
భూభారతితో సత్వర న్యాయం, ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
చిన్నంబావి, జనవరి 6 : 50 ఏండ్లుగా ఎదురు చూస్తున్న నిరీక్షణ కు భూభారతితో సత్వర న్యాయం జరిగిందని మండల తహసీల్దార్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టం ద్వారా చిన్నమరూర్ గ్రామానికి చెందిన 10 మంది రైతులకు భూమి పట్టా పంపిణీ చేశామని,
గతంలో సర్వే నం 201 ఉన్న 7 ఎకరాల 24 గుంటల భూమి అధికారుల తప్పిదాల కారణంగా నిషేధిత జాబితాలో తప్పుగా రికార్డు చేశారని సమగ్ర విచారణ తర్వాత బాధిత రైతులకు భూ భారతి చట్టం ద్వారా పట్టాలు అందించామని ,చిన్నమారుర్ గ్రామంలో సర్వేనెం: 201లో శ్రీనివాస్ రావు కు చెందిన 11ఎకరాల 34 గుంటల విస్తీర్ణంలో భూమిలో 1976 సంవత్సరంలో 201 సర్వే నంలో ఉన్న భూమి నుంచి శ్రీశైలం హైడ్రీ ప్రాజెక్టులో భాగంగా 4 ఎకరాల 8 గుంటల భూమినీ శ్రీశైలం ఖరీజు ఖాతాలీ లో చేర్చారన్నారు.
ప్రభుత్వ నష్టం పరిహారం కూడా ఆ 4ఎకరాల8 గుంటలకు ఆరోజుల్లో అందుకోవడం జరిగిందని మిగిలిన భూమిని శ్రీనివాస్ రావు గ్రామానికి చెందిన పింజరి పెద్ద బలేసాబ్ సాబ్,పింజరి చిన్న బాలే సాబ్, పకీర్ సాబ్ అమ్మడంతో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా నేటి వరకు సాగు చేస్తున్నారని ఆయన అన్నారు.పింజరి చిన్న బాలేసాబ్ కుమారుడు నబీ సాబ్ మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు సర్వే నం:201లో ఉన్న భూమి పట్టా కోసం అనేక మార్లు మండల, జిల్లా కార్యాలయాలలో అర్జీలు పెట్టిన ఏలాంటి ఫలితం రాలేదన్నారు.
మా తల్లిదండ్రుల తర్వాత మేము కూడా కార్యాలయాలకు అనేక అర్జీలు పెడుతూ కోర్టులకు విన్నవించగా కోర్టు ద్వారా సర్వే నం: 201 భూమి మొత్తం ఖరీజ్ ఖాతాలీ భూమిగా నమోదు చేశారని చెప్పగా మేము పలుమార్లు కార్యాలయాలకు అర్జీలు పెట్టనా మా భూమి పట్టా కాలేదు. గత 50 సంవత్సరాలుగా మా భూమిపై అనేక దఫాలుగా భూమి పట్టా కోసం పోరాడుతూనే వచ్చారు.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టం 2025 గ్రామ సదస్సులో మరో మారు అర్జీ సమర్పించగా మండల తహసీల్దార్ శ్రీనివాస్ సిబ్బంది మోఖ విచారణ జరుపగా గతంలో ఉన్న అధికారుల తప్పిదాల సర్వే నం: 201/1లో ఉన్న 7 ఎకరాల 24 గుంటల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్లు తప్పుగా రికార్డు కావడం జరిగిందన్నారు.
ఇట్టి సర్వే నం 201/1లో ఉన్న 7ఎకరాల 26 గుంటల భూమిని భూ భారతి చట్టం ద్వారా నిషేధిత జాబితా నుంచి తొగించి ఆర్జిదారుని పేరిట పట్టా చేయాలని ఆర్డీవో కు స్థానిక తహసీల్దార్ నివేదిక చేయగా ఆ నివేదికపై రికార్డు యుక్తముఖంగా విచారణ చేసిన ఆర్డీవో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి నివేదిక అందించగా ఆ వేదికపై జిల్లా కలెక్టర్ స్వయంగా చిన్నమారూర్ గ్రామాన్ని సందర్శించి సర్వే నం: 201/1 లో ఉన్న భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి చిన్నమారుర్ గ్రామానికి చెందిన 10 మంది రైతులకు పట్టా చేయవలసిందిగా స్థానిక తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేశారన్నారు.
తదనంతరం తమ 50 ఏళ్ల కాల నేటితో తీరిందని, రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్తం చట్టం భూ భారతి ద్వారా మా భూమిపై పట్టా హక్కులు లభించాయని పింజరి నబీ సాబ్ ఆనందం వ్యక్తం చేశారు.