calender_icon.png 26 January, 2026 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్టమర్లకు నాణ్యమైన సేవలే లక్ష్యం కావాలి

26-01-2026 02:47:28 AM

బడంగ్‌పేట్, జనవరి 25(విజయక్రాంతి): వ్యాపార సంస్థలు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన సేవలు అందించినప్పుడే అవి అభివృద్ధి చెందుతాయని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ తిరుమలనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శాస్త అల్యూమినియం’ షోరూమ్ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేనూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ, ఈ సంస్థ మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.వినియోగదారులను ఆకట్టుకునే నాణ్యత, సరసమైన ధరలు ఉన్నప్పుడే ఏ వ్యాపారమైనా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు.స్థానికులకు అందుబాటులో ఇలాంటి షోరూమ్లు రావడం శుభపరిణామమని తెలిపారు.

షోరూమ్ నిర్వాహకులు నారోజు మురళీధర్ చారి, కండ్లకుంట జనార్ధన్ చారి మాట్లాడుతూ.. తమ షోరూమ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ వద్ద అన్ని రకాల అల్యూమినియం సేవలు అత్యంత నాణ్యతతో, తక్కువ ధరలకే లభిస్తాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను, ఇతర ప్రజాప్రతినిధులను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.