26-01-2026 02:46:51 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 25: తెలుగు భాష, కళలు, సంస్కృతి పరిరక్షణ, ప్రోత్సాహానికి అంకితమైన ప్రముఖ సాం స్కృతిక సంస్థ తెలుగు సంగమం ఆధ్వర్యంలో సంక్రాంతి సమ్మేళనం 2026ను హైదరాబాద్‌లోని శ్రీమంత్ర కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన పీఠాధిపతి, పూజ్యశ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి వారి ఆశీర్వచనాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రాంతీయ భాషలు, సంప్రదాయాలను సజీ వ వారసత్వాలుగా కాపాడుకోవాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమానికి హాజరై, తెలుగు సంగమం తెలుగు సంస్కృ తి, భాష పరిరక్షణకు చేస్తున్న కృషిని అభినందిస్తూ, జాతీయ స్థాయిలో తెలుగు గుర్తిం పును బలపరచడంలో ఇలాంటి కార్యక్రమాల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గౌరవ అతిథిగా పాల్గొని, తెలుగు భాషా వైభవం, సంస్కృతి గొప్పతనంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
గౌరవ అతిథులుగా ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను, ద్విశతావధాని డాక్టర్ బులుసు అపర్ణ, అమెరికాకు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్, తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకులు డాక్టర్ అల్లా శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు.సభకు అధ్యక్షత వహించిన పి. మురళీధర్ రావు తెలుగు భాష గొప్పతనం, పండుగలు, సంప్రదాయాలు, సాం స్కృతిక వారసత్వంపై ప్రసంగించారు.