calender_icon.png 26 January, 2026 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోపిడీ పార్టీలే

26-01-2026 02:48:23 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 (విజయక్రాంతి): రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, మోసపూరిత, ఆచరణ సాధ్యం గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు తెలంగాణను దోచుకునే దోపిడీ పార్టీలేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్బులో మున్సిపల్ ఎన్నికల విజయసంకల్ప సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు.  రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎక్కడికక్క డ తెలంగాణను దోచుకున్నారని ధ్వజమెత్తారు. నేడు కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏమి టంటే దోచుకున్న సొమ్మును పంచుకునేందుకు కొట్లాడుకుంటున్న పరిస్థితి ఉందన్నా రు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీకి పట్టం కడితే ఆ పార్టీ సైతం బీఆర్‌ఎస్ దారిలోనే ప్రయాణిస్తుందన్నారు.

420 లు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. సింగరేణి సమస్త దోపిడీకి గురవుతుందని, ప్రస్తుతం నష్టాల బాట  పట్టిందన్నారు.   ఫుట్బాల్ ఆటగాడు మెర్సి వస్తే రూ 10 కోట్లు సింగరేణి సంస్థ నుంచి తెచ్చి ఖర్చు పెట్టారని, ఫుట్బాల్ కు సింగరేణికి ఏమైనా సంబంధం ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు చెందిన రూ: 51 కోట్లను వాడుకొని ఇవ్వకపోవడంతో సింగర్ సంస్థ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఫలితంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు.