05-11-2025 12:08:35 AM
రాజేంద్ర నగర్, నవంబర్ 4, ( విజయక్రాంతి): అభివృద్ధి పనుల్లో నాన్యత ప్రమాణాలు పాటించాలని మైలార్దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పద్మశాలి పురం లో నిర్మించే సిసి రోడ్డును స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలిపురంలో అభివృద్ధి పనులలో భాగంగా నూతనంగా నిర్మించిన సీ సీ రోడ్డు పనులను రాజేంద్ర నగర్ నియోజక వర్గ ఇంచార్జ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి గారు జిహెచ్‌ఎంసి అధికారులు, బస్తీ వాసులతో కలిసి పనులను పరిశీలంచారు.
అదే విధంగా పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేయాలన్నారు. నాణ్యత లోపాలు లేకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట రోడ్డు పొడిగించి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ నరసింహమూర్తి, వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్ రెడ్డి ఎల్వీ రెడ్డి రాజ్ కుమార్ రామకృష్ణ రామకృష్ణ పాండురంగారెడ్డి భూపతిరెడ్డి మల్లికార్జున్ బబ్లు మధుసూదన్ రెడ్డి శంకర్ రెడ్డి రమేష్ రెడ్డి అభి శివ చారి బస్తీ వాసులు పాల్గొన్నారు.