calender_icon.png 5 November, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల్ కళాశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

05-11-2025 12:06:59 AM

ఘట్ కేసర్, నవంబర్ 4 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ గురుకుల్ కళాశాలలో గురుకుల పరిరక్షణలో భాగంగా గురుకుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్  సహకారంతో ఓ.ఎన్.జి.సి వారి సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ను తన సొంత ఖర్చులతో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి  గురుకుల్ కళాశాలలో దాన్ని మరమ్మత్తు చేసి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జేఏసీ కన్వీనర్ మారo లక్ష్మారెడ్డి తో కలిసి మంగళవారం ప్రారంభించడం జరిగింది.

విద్యార్థులు సేవ్ గురుకుల్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గురుకుల్ పరిరక్షణ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మరుగుదొడ్ల పనులను పర్యవేక్షించి త్వరలో విద్యార్థులకు అందుబాటులో వచ్చేటట్టు చేస్తామని తెలిపారు. తన సొంత ఖర్చుతో గురుకుల్ రైల్వేగేట్ ప్రహరీగోడ అసంపూర్తిగా మిగిలి ఉన్నందున అది పూర్తి చేయుటకు తన సొంత గ్రామమైన ఘట్ కేసర్ కి  శ్రేయోభిలాషి కందకట్ల మాధవరెడ్డి ఇనుప కంచె  పనులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు, శ్రేయోభిలాషులు, విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.