16-08-2025 06:46:24 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి కృష్ణ మందిర్ లో కృష్ణాష్టమి వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు గోకుల అష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని ఉయ్యాల కార్యక్రమంలో పాల్గొని అంజనేయ శాస్త్రి ప్రవచనాలను భక్తులు విన్నారు. శ్రీకృష్ణుడు గురువు బాధ్యతలు ఉన్నాడని ఆయన ఎవ్వరు అడిగిన సహాయం చేయడానికి వెనుకకు రాలేదని ఆయన తెలిపారు. ప్రతి మనిషి శ్రీకృష్ణుని బాటలో నడిచి సంపాదించిన దాంట్లో కొంత సాయం చేయాలని ఆయన సూచించారు. కృష్ణుని జన్మదినం సందర్భంగా లింగంపల్లి ఆలయంలో పెద్ద ఎత్తున అలంకరణ చేశారు. ఆలయాల అలంకరణ చూసి భక్తులు సంతోషించారు మచాలే బాబా మనోహర్ బాబా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కృష్ణ మందిర్ లో కూడా ఉట్టి కొట్టడం ఉయ్యాల కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఘనంగా నిర్వహించారు.