16-08-2025 07:10:11 PM
ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
మేడిపల్లి: స్వాతంత్ర దినోత్సవం రోజు మద్యం దుకాణాలు బంద్ కావడడంతో విక్రయదారులు అక్రమంగా మద్యం అమ్ముతున్నారని సమాచారం మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గస్తీ నిర్వహించారు. వేరు వేరు ప్రాంతాలలో ఇద్దరు వ్యక్తులు అందులో ఒకరు టెలిఫోన్ కాలనీలో మురారి శెట్టి సంపత్ కుమార్, మరొకరు మహంకాళి బార్ ఓపెన్ ప్రాంతంలో లిక్కర్ అమ్ముతున్న బత్తిని అజయ్ ను పట్టుకుని విచారించారు. 15 ఆగష్టుకు మద్యం షాపులు బంద్ ఉండడంతో అధిక ఆదాయం కోసం ముందు రోజు మద్యం షాప్ లలో మద్యం కొనుగోలుచేసి అమ్ముతున్నారని, వీరిపై కేసు నమోదు చేశారు. అలాగే వారి నుండి 8.190 లీటర్ల మద్యం సీజ్ చేశామని మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి తెలిపారు