16-08-2025 06:53:47 PM
మునగాల (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మిక సంఘం మునగాల మండల 5వ మహాసభలు ఈనెల 18న సోమవారం నాడు జరుగు మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం(CITU District Committee Members Bachalakura Swarajyam) కార్మికులకు పిలుపునిచ్చారు శనివారం సుందరయ్య భవనంలో షేక్ దస్తగిరి అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మిక సంఘం గత మండల మహాసభ నుంచి నేడు జరగబోతున్న మండల మహాసభ వరకు గత కార్యక్రమాల సమీక్షపై చర్చించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను ఈ నెల 18న సోమవారం నాడు జరుగు 5వ మండల మహాసభలో రూపొందించుకొని కార్మికుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కొరకు నిరంతరం పని చేస్తామని తెలియజేస్తూ కార్మికులందరూ ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు షేక్ దస్తగిరి మండల కార్యదర్శి నాగేంద్రబాబు మండల సహాయ కార్యదర్శి అల్లి నాగరాజు సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కోలా ఆంజనేయులు ఉపాధ్యక్షులు షేక్ సైదా షేక్ జాన్ పాషా షేక్ కాజా, జి కనకయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు,