calender_icon.png 16 August, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

16-08-2025 06:50:58 PM

బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు భోశెట్టి రవి ప్రసాద్

మణుగూరు,(విజయక్రాంతి): మండలంలోని రాజీవ్ గాంధీ నగర్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు భోశెట్టి రవి ప్రసాద్ డిమాండ్ చేశారు.  శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సకల సౌకర్యాలతో ప్రజల కు ఒకేచోట కూర గా యలు, పండ్లు, మాంసం, విక్రయించేందుకు గత బీఆర్‌ఎస్ సర్కార్‌ ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్‌ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందు కోసం 2021లో  నాటి ఎమ్మెల్యే రేగా కాంతారావు  రూ.4 కోట్ల  వ్యయంతో శంకుస్థాపన చేశారని, దాదాపు 95 శాతం పనులు పూర్తయిన మార్కెట్ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడిచిన  నేటికీ ప్రారంభించలేదని ఆరోపించా రు.కోట్ల రూపాయల ప్రజాధనం తో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం  అసాంఘిక కార్యకలాపాల కు అడ్డాగా మారిందన్నారు. వెంటనే ప్రభుత్వం భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లో తీసుకురావాలని కోరారు.