calender_icon.png 16 August, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తమైన రెవెన్యూ శాఖ..

16-08-2025 06:51:01 PM

వాగులు, చెరువులు పరిశీలన...

సదాశివనగర్ (విజయక్రాంతి): మండలంలోని అమర్ల బండ, వజ్జే పల్లి, యాచారం, మల్లుపేట్, సదాశివనగర్ కొత్త చెరువులను మండల రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్నా వర్షాలకు చెరువులు వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో తహసీల్దార్ సత్యనారాయణ(Tahsildar Satyanarayana) సిబ్బందితో కలిసి శనివారం వాగులు, చెరువులను పరిశీలించారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని సూచించారు. ఆయన వెంట ఆర్ఐ సాహిత్య, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.