16-08-2025 06:55:45 PM
బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్..
వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ నగరంలో వినాయక మండపాలను ఏర్పాటు చేయు భక్త మండలి ఏర్పాట్లలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా నిర్వహించడం కోసం శనివారం వరంగల్ ఏసిపిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ, చారిత్రాత్మక మన ఓరుగల్లు నగరంలో గత అనేక సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పండుగను యూత్ అసోసియేషన్లు, భక్తమండలి, కాలనీ సంఘాలు కమిటీలుగా ఏర్పడి వారి వారి ప్రాంతాలలోని ప్రధాన కూడలిలో మండపాలను ఏర్పాటు చేసి, నవరాత్రులు పూజలు చేసి మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కావున వారి వారి ప్రాంతాలలో ఏర్పాటు చేసే మండపాలకు ఎటువంటి అసౌకర్యం ఆటంకాలు జరగకుండా తగిన వసతులు కల్పించి భక్తి భావంతో వినాయక చవితి నవరాత్రులు దిగ్విజయంగా జరుగుటకు అన్ని విధాల సహకరించాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా తరఫున కోరడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, గడల కుమార్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, జిల్లా కిసాన్ మోర్చా జిల్లా బైరి నాగరాజు, జిల్లా కోశాధికారి కూచన క్రాంతి కుమార్, జిల్లా అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్, ప్రచార కార్యదర్శి బైరి శ్యాంసుదర్, జిల్లా నాయకులు పొట్టి శ్రీనివాస్ గుప్తా, ముండ్రాతి వెంకటేశ్వర్లు, కొంతం సంగీత్, సీతా నాగరాజు, వెనిశెట్టి రోహిత్, ధర్మపురి రామారావు, గబ్బేట ప్రవీణ్ లు తదితరులు పాల్గొన్నారు.