calender_icon.png 16 August, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వాజ్పేయి వర్ధంతి

16-08-2025 06:59:20 PM

భారత మాత ముద్దు బిడ్డ భారత మాజీ ప్రధాని..

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పట్టణ బీజేపీ, ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ రెండు ఎంపీల తోటి ప్రారంభమైన జైత్రయాత్రను ముందుండి నడిపిన మహనీయుడు నేడు 400 సీట్ల జైత్రయాత్రలో కొనసాగడానికి బాటలు వేసిన మహనీయుని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు. బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, అఖండ భారతం నేడు అన్ని దేశాలతో పోటీపడుతూ మోడీ నేతృత్వంలో ముందుకు పోవడానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు గొప్ప రాజకీయవేత్త అటల్ బీహార్ వాజ్‌పేయి వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించి నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేవుల మల్లికార్జున్ వాసు మల్లేశం యాదవ్ బచ్చు వంశీ రేగుల శ్రీకాంత్ బిల్లా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.