26-01-2026 01:35:07 AM
సూర్యాపేట, జనవరి 25 (విజయ క్రాంతి) : పెరిక కుల సంఘ సభ్యులు ఐక్యతతో ముందుకు సాగాలని సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దొంగరి మనోహర్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దాసరి మల్లేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక కుల సంఘ ఎన్నికలు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో పూర్వ అధ్యక్షుడు మాడిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర పెరిక కుల సంఘం (766/2014 ) అనుబంధంగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా తిప్పని పరమేష్, ప్రధానకార్యదర్శిగా కోట సుధాకర్, కోశాధికారిగా దాచేపల్లి రాజును ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.