calender_icon.png 24 January, 2026 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి ఉత్తమ్‌కు ఫోన్‌లో రాహుల్ పరామర్శ

03-10-2024 02:09:59 AM

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాం తి): రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పితృ వినియోగంపై కాంగ్రస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతాపం ప్రకటించారు. ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేస్తూ లేఖ పంపడంతో పాటు బుధవారం రాహుల్ ఫోన్ చేసి పరామర్శించారు. మూడురోజుల క్రితం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఉత్తమ్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని లేఖలో రాహుల్‌గాంధీ కోరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఉత్తమ్ నివాసానికి వెళ్లి పురు షోత్తంరెడ్డి చిత్రపటానికి నివాళి  అర్పించారు.