27-09-2025 01:59:05 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం కొట్టేసింది. గతంలో అమెరికా పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ ఓ వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా.. వారణాసికి చెందిన నాగేశ్వర్ మిశ్రా రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టుకెళ్లారు.
అయితే ఈ వ్యాఖ్యలు అమెరికాలో చేశారని, తమ పరిధిలోకి రావని అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. అనంతరం కోర్ట్ ఆఫ్ స్పెషల్ జడ్జి మిశ్రా వేసిన రివిజన్ పిటిషన్‌ను స్వీకరించి విచారణ చేయాలని అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు. వారణాసి ఎంపీ/ఎమ్మె ల్యే కోర్టు దర్యాప్తునకై ఇచ్చిన ఉత్తర్వులను రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టులో స వాల్ చేస్తూ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తాజాగా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కోర్టు పిటిషన్‌ను కొట్టేయడంతో ప్రత్యేక కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది.
రాహుల్ వ్యాఖ్యలివే
భారత్‌లో సిక్కులకే కాకుండా అన్ని మతా ల ప్రజలకు స్వేచ్ఛగా తమ మతాన్ని అనుసరించే అవకాశం లేదని ఆరోపించారు. 2024 లో రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సంతతి వ్యక్తులు వర్జీనియాలో ఏర్పా టు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ సిక్కు వర్గంపై వ్యాఖ్యలు చేశారు.
‘భారత్‌లో సిక్కులు స్వేచ్ఛగా తమ మత విశ్వా సాలను పాటించలేకపోతున్నారు. సిక్కులు తలపాగాలు, కారా (స్టీలు కడెం) ధరించడానికి వీల్లేదు. అంతే కాకుండా గురుద్వారాల్లోకి ప్రవేశించడానికి కూడా అనుమతి లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల మీదే నాగేశ్వర్ మిశ్రా అనే వ్యక్తి కోర్టులో ఫిర్యాదు ఏశారు.