14-12-2025 12:54:29 AM
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి వెళ్లారు. రాహుల్‌గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూ డా హస్తినకు వెళ్లారు. ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాలు ఆటగాడు మెస్సి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ను తిలకించడానికి రాహుల్‌గాంధీ శనివారం హైదరాబాద్‌కు వచ్చిన విష యం తెలిసిందే. ఫుట్‌బాల్ మ్యాచ్‌ను తిలకించిన అనంతరం రాహుల్‌గాంధీ ఢిల్లీకి వెళ్లారు.
ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఓటు చోరీపై జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. పార్టీ నేతలు కూడా భారీగా హాజరుకావాలని పీసీసీ అధ్యక్షుడు పిలుపు ఇచ్చారు. దీంతో మంత్రులు, పార్టీ నేతలు, నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా, రాష్ట్రంలో ఓటు చోరీకి సంబంధించి 10 లక్షల వరకు సంతకాల సేకరణ చేయగా, వాటిని మూడు రోజుల క్రితమే ట్రక్కులో ఢిల్లీకి పంపించారు.