24-11-2025 12:00:00 AM
ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య
ఆలేరు, నవంబర్ 23 (విజయ క్రాంతి): ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామం రైల్వే గేట్ అండర్ ప్రోస్ బ్రిడ్జిని ఆరు నెలల్లో సాంక్షన్ చెప్పి తీరుతానని మాట ఇచ్చిన స్థానిక ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. రైల్వే గేట్ అండర్ ప్రోస్ బ్రిడ్జి కొరకు గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, గుండ్లగూడం,
శ్రీనివాసపురం, పటేల్ గూడెం, శివలాల్ తండా, గ్రామ ప్రజలు రీలే నిరాహార దీక్షలు చేపట్టడం తెలిసిన విషయమే, నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు నంద గంగేష్, బైరి మహేందర్, ఎలుగల వెంకటేష్, సుక్క రాజు, శేషత్వం అమరేందర్, బోగ శ్రీనివాస్, శేషాత్వం అర్చన తదితరులకు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు బండ్రు శోభారాణి నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షన విరమింప చేసినారు.