24-11-2025 12:00:00 AM
సంస్థాన్ నారాయణపూర్, నవంబర్ 23(విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేలు గ్రామానికి చెందిన శ్రీరామోజు ప్రభాకరా చారి గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాకర చారి భార్య కూడా మరణించారు. వీరికి ముగ్గురి సంతానం. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు వీరికి కుటుంబ పెద్దదిక్కు లేకుండా అనాధలుగా మిగిలిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న ఇఎల్వి ఫౌండేషన్ చైర్మెన్ భాస్కర్ భాస్కర్ తక్షణం స్పందించి ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ చేతుల మీదుగా ప్రభాకరా చారి దశదిన కర్మ కోసం క్వింటాల్ బియ్యాన్ని అందించి త్వరలోనే వారి కుటుంబాన్ని సందర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్వేలు ఇఎల్వి టీం సభ్యులు, సర్వేలు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.