calender_icon.png 10 August, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్

10-08-2025 01:43:35 AM

  1. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

దత్తాత్రేయకు రాఖీ కట్టిన పారిశుద్ధ్య కార్మికులు

ముషీరాబాద్, ఆగస్టు 9: సోదరి సోదరుల ప్రేమ, ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ అని హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నా రు. శనివారం రాఖీ పండుగ సందర్భంగా రాంనగర్‌లోని ఆయన నివాసంలో వారి కుటుంబ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, శ్రేయోభిలాషులతో కలిసి రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

తన మనవరాలు జశోదర, వేదాంషి, పారిశుద్ధ్య కార్మికులు రాఖీ కట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్మికులు మన వీధుల్ని, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుతూ మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని,  అటువంటి వారిని మన కుటుంబ సభ్యులుగా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

వారి ఉద్యోగ భద్రత, పెన్షన్లు, గ్రాట్యూటీ, పిఎఫ్, ఈఎస్‌ఐ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాల పరిధిని  విస్తృతం చేసి పారదర్శ కతతో ముందుకు తీసుకెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. ఈ రక్షాబంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని అది మన కుటుం బ బంధాలను మరింత మెరుగుపరిచే పవిత్రమైన సాంప్రదాయమని పేర్కొన్నారు.