10-08-2025 01:42:10 AM
గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఆత్మీయతకు, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొన్నా రు. రక్తసంబంధాన్ని, మనుషుల మధ్య మమతను గుర్తుచేసే పవిత్రమైన పండుగ రాఖీ పౌర్ణమి అని అభిప్రాయపడ్డారు.
సోదరభావాన్ని పెంపొందించి, కుటుంబ వాతా వరణాన్ని కాపాడే పండుగ అని అభివర్ణించారు. శనివారం రక్షాబంధన్ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు విశ్వహిందూ పరిషత్, మాతృశక్తి, దుర్గావాహిని నాయకులు రాఖీ కట్టారు. మంగళ హారతులు ఇచ్చి దీవెనలు అందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ విశ్వహిందూ పరిషత్ మహిళా నాయకులకు శుభాశీస్సులు అందజేశారు. ధర్మకార్యంలో విజయం సాధించా లని దీవించారు. కులమతాలకు అతీతంగా సమస్త మానవాళికి సోదరతత్వాన్ని అందిం చే పండగ రాఖీ పౌర్ణమి అని గవర్నర్ తెలిపారు.
కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ర్ట ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, విశ్వహిందూ పరిషత్ మహిళా విభా గం మాతృశక్తి రాష్ర్ట కన్వీనర్ పద్మశ్రీ, కో కన్వీనర్లు శ్రీవాణి, లక్ష్మీ సరోజ, వాణి దేవి, దుర్గావాహిని రాష్ర్ట కన్వీనర్ వాణి సక్కుబా యి, రాష్ర్ట బాల సంస్కార ప్రముఖ్ శిరీష, మహంకాళి కన్వీనర్ భవాని పాల్గొన్నారు.