10-08-2025 01:17:34 AM
మీనాక్షి యాత్రగా కావాలనే దుష్ప్రచారం
రాష్ట్రంలో వచ్చేది బీసీ ముఖ్యమంత్రే
పదేండ్లు తానే సీఎం అన్న రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది?
మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ సారి ముఖ్యమంత్రి అయ్యేది బీసీ నాయకుడేనని.. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచేనని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాబోయే పదేళ్లు తానే సీఎంనంటూ రేవంత్ రెడ్డి మాట్లాడటం తప్పే మీ కాదని.. తమ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేందుకే సీఎం అలా మాట్లాడినట్టు పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన పలు అంశాలపై మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
సీఎంతో తనకు విభేదాలు ఉన్నట్టు కొందరు విష ప్రచా రం చేస్తున్నారని.. తనకు, సీఎంకు మధ్య సత్సంబంధాలు ఉండటం వల్లే రిజర్వే షన్లపై ఇంత వరకు పోరాడినట్టు వెల్లడించారు. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనహిత పాదయాత్ర తనదేనని.. అయితే కొం దరు కావాలనే మీనాక్షి నటరాజన్ యాత్ర అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మొదట బస్సుయాత్ర చేయాలని అనుకున్నామని.. ఆ తర్వాత పాదయాత్రగా మార్చినట్టు స్పష్టం చేశారు. ఈ నెల 23 తర్వాత మళ్లీ జనహిత పాదయాత్రను మొదలు పెడతామ ని తెలిపారు. తన పాదయాత్రలో సీఎం, డి ప్యూటీ సీఎం, మంత్రులు కూడా మధ్యలో భాగస్వాములవుతారని.. భారత్ జోడో యా త్ర తలపించేలా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. యాత్రలో కొత్త పెన్షన్‌లు ఇ వ్వాలని ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయని పేర్కొన్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ దృఢనిశ్చయాన్ని శంకిచాల్సిన అవసరం లేదన్నారు. గుజరాత్, ఢిల్లీ, యూ పీలో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లపై కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశా రు. రాంచీ పర్యటన ఆలస్యమవడంతో జం తర్‌మంతర్ ధర్నాకు రాహుల్‌గాంధీ రాలేకపోయారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ఏఐ సీసీ కార్యాలయంలో ఇచ్చిన పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్‌కు ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రి యాంక గాంధీ వచ్చారని తెలిపారు.
వారి మౌనం.. బీసీలకు నష్టం
కేంద్రమంత్రి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్ మౌనం బీసీలకు తీవ్ర నష్టం కలిగించనుందని విమర్శించారు. కిషన్‌రెడ్డి భయంతోనే బండి, ఈటల మాట్లాడ టం లేదని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి అంశంపై క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చాలా మారారని.. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు రేవం త్‌రెడ్డి వేరు.. ఇప్పటి రేవంత్‌రెడ్డి వేరు అని పేర్కొన్నారు.
అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్ద తు ఇచ్చిన బీజేపీ.. కేంద్రంలో బిల్లు ఆమో దం పొందడానికి సహకరించడం లేదన్నా రు. పదవుల భర్తీపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. నాలుగైదు రోజుల్లో పీఏసీ సమావేశం ఉంటుందని, బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈడీ, సీబీఐ కేసులన్నీ ప్రతి పక్షాలపైనే పెడుతున్నారని మండిపడ్డారు. ఈసీ పనితీరు సక్రమంగా లేదని, ఒకే వ్యక్తికి నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని, ఎస్‌ఐఆర్ పేరిట పెద్ద మోసం జరుగుతోంద న్నారు.
ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒప్పందంలో భాగంగానే సం జయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆ రోపించారు. సికింద్రాబాద్ ఎంపీ టి కెట్‌ను, రాష్ర్ట అధ్యక్ష పదవిని బీసీల నుంచి కిషన్‌రెడ్డి లాక్కున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతుందని, నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుంద న్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పె ట్టకుండా ఉండే సంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేశారన్నారు. స్థానిక ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరుపై నడకేనని జోస్యం చెప్పారు.