10-08-2025 01:43:00 AM
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని శనివారం రాష్ట్ర ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. సోదరీమణులు తమ సోదరుల ఇండ్లకు వెళ్లి రాఖీలు కట్టారు. వరుస సెలవులు రావడంతో రెండు రోజుల ముందు నుంచే స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో బస్టాండులు, రహదారులు కిక్కిరిసిపోయాయి. మార్కెట్‌లో ఎటుచూసినా రాఖీలు, మిఠాయిల కొనుగోలు దారులతో సందడిగా కనిపించింది.