calender_icon.png 10 July, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రం

10-07-2025 12:01:52 AM

ఎల్బీనగర్/అబ్దుల్లాపూర్‌మెట్/ యాచారం, జూలై 9: కార్మిక సంక్షేమ చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొ చ్చిన 4 లేబర్ కోర్డులను వెంటనే రద్దు చే యాలని బుధవారం కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గం లోని సాగర్ రింగ్ రోడ్,హయత్ నగర్, ఇబ్రహీంపట్నం నియోజవకర్గంలోని పెద్ద అంబర్‌పే ట్ మున్సిపాలిటీ, యాచారం మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ గా వెళ్లి.. నేషనల్ హైవే65పై రాస్తారోకో నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అలాగే యాచారం మం డల కేంద్రంలో సాగర్ రహదారి పై భారీ ప్రదర్శన, నిరసన చేపట్టారు. కార్మికులకు న ష్టం చేకూర్చే 4 లేబర్ కోర్డులను వెంటనే ర ద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జి ల్లా నాయకులు ఏర్పుల నర్సింహా, రైతు సం ఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, చంద్రమోహన్, నర్సిరెడ్డిసుమలత, శి వకుమార్, మహేష్, ఆలేటి ఆటం, మైస య్య, జంగయ్య, నర్సింహా, మైపాల్, జ్యోతి బస్, మైసయ్య, రవి, పి.అంజయ్య, పి.బ్రహ్మ య్య, ఎస్.చందు , ఆలంపల్లి జంగయ్య, ర వీందర్ యాదయ్యలు పాల్గొన్నారు.