17-08-2025 12:34:05 AM
వాతావరణశాఖ ప్రకటన
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో ఆరు రోజు లపాటు(ఈ నెల 23 వరకు) భారీ వర్షాలు కురవనున్నాయని, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని శనివారం తెలంగాణ వాతావరణశాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, భద్రా ద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
హనుమకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుకురుస్తాయని హెచ్చరించింది. వానలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉంటాయని స్పష్టం చేసింది.