17-08-2025 12:33:50 AM
తెలంగాణ ఉద్యమ నాయకుల హాజరు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ‘వైద్య గర్జన’ స్ఫూర్తిని పురస్కరించుకుని ఉస్మానియా వైద్య కళాశాల ఆడిటోరియంలో శనివారం డాక్టర్ దు ర్గా కిరణ్ ఆధ్వర్యంలో వైద్య గర్జన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. మెడికల్ జేఏ సీ చైర్మన్ డాక్టర్ బొంగు రమేష్, టీపీహెడీఏ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్ధన్ హాజరయ్యారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం 2010లో ఉస్మానియా మెడికల్ కాలే జీ 2005 బ్యాచ్ విద్యార్థులు ప్రారంభించిన ‘వైద్య గర్జన’ ఉద్యమం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆనాటి ఉద్విగ్న క్షణాల ను, పోరాట ఘట్టాలను గుర్తుచేసుకుంటూ నాయకులు భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ దుర్గా కిరణ్ మాట్లాడుతూ.. ఉద్యమ చరిత్రలో వైద్య గర్జనకు ఉ న్న ప్రాధాన్యతను కొందరు మరుగునపరిచే ప్రయత్నం చేశారని, ఆ మహోన్నత చరిత్ర ను, స్ఫూర్తిని మళ్లీ గుర్తు చేసుకోవడానికే ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. డాక్టర్ బొంగు రమేష్ మాట్లాడు తూ.. రాష్ర్ట సాధనలో వైద్యుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.